విజయ్ సినిమా కోసం భారీ సెట్టింగ్

విజయ్ సినిమా కోసం భారీ సెట్టింగ్

మెర్సల్, సర్కార్ విజయం తరువాత తలపతి విజయ్ చేస్తున్న 63 వ సినిమా రీసెంట్ గా ప్రారంభమైంది.  అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ ను నిర్మిస్తున్నారు.  ఇందులో విజయ్ ఫుట్ బాల్ కోచ్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే.  ఫుట్ బాల్ మ్యాచ్ కోసం రూ.6 కోట్ల రూపాయలతో ఈవీపి స్టూడియోస్ లో స్టేడియం సెట్ ను నిర్మిస్తున్నారు.  అక్కడే ఓ భారీ షెడ్యూల్ షూట్ ఉంటుందట.  

ఏజీఎస్ సినిమాస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.  నయనతార హీరోయిన్.  ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ చేస్తారట.