తలపతి విజయ్ మరోసారి రుజువు చేశాడు...

తలపతి విజయ్ మరోసారి రుజువు చేశాడు...

స్టార్ హీరోలుగా ఎదిగిన తరువాత చాలా మందికి చిన్న చిన్న విషయాల గురించి పెద్దగా తెలియవు.  తెలిసినా వాటిని చేయాలని అనుకున్నా చేయలేరు.  ఇమేజ్ కావొచ్చు లేదంటే మరేదైనా కారణాలు కావొచ్చు.   ఎవరో ఒకరిచేత ఆ పని చేయిస్తుంటారు.  తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ మాత్రం అలా కాదు.  తన కళ్ళముందు ఏదైనా జరగరానిది జరిగితే... వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటాడు.  ఇలా ఇప్పటికే చాలాసార్లు విజయ్ మానవత్వాన్ని రుజువు చేసుకున్నాడు.  

తాజాగా విజయ్.. అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ సమయంలో అక్కడ పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్ సెల్వరాజ్ కు అనుకోకుండా గాయాలు అయ్యాయి.  వెంటనే అతనిని పోరూర్ లోని శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజీలో జాయిన్ చేశారు.  అక్కడ చికిత్స పొందుతున్న సెల్వరాజ్ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి విజయ్ షూటింగ్ నుంచి హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించారు. అంతేకాకుండా సెల్వరాజ్ వైద్యానికి కావలసిన ధన సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నాడు.