పొలిటికల్ స్క్రీన్ పైకి మరో హీరో.. 31నే పార్టీ ప్రకటన..!

పొలిటికల్ స్క్రీన్ పైకి మరో హీరో.. 31నే పార్టీ ప్రకటన..!

సినిమా పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వెళ్లి చక్రం తిప్పిన నేతలు ఎంతో మంది ఉన్నారు.. అప్పుడు.. ఇప్పుడు.. భవిష్యత్‌లో అన్నట్టుగా.. ఈ రెండు రంగాలకు లింక్‌లు కొనసాగుతూనే ఉన్నాయి.. స్టార్ హీరోల నుంచి నటులు, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు, అబ్బో ఒక్కరేంటి.. ఎన్నికల ప్రచార సమయంలో అవసరం అనుకుంటే జెండా పట్టి ప్రచారం చేసినవాళ్లు ఎంతో మంది.. ఇక, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమయం దగ్గర పడుతుండడంతో.. ఆ రాష్ట్ర పాలిటిక్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.. ఇప్పటికే  లోక నాయకుడు కమల్ హాసన్  తన రాజకీయ పార్టీ అనౌన్స్ చేయగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరలో రాజకీయ పార్టీ అంటూ ప్రకటించి.. అనారోగ్య కారణాల రీత్యా వెనక్కి తగ్గి.. నో పాలిటిక్స్ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు.. దీంతో.. మరోస్టార్  హీరో ఇప్పుడు తమిళ పొలిటిక్‌ స్క్రీన్‌పైకి వచ్చారు.. ఆయనే ఇళయదళపతి విజయ్.

విజయ్‌.. పార్టీ పేరు ను ఎన్నికల‌సంఘంలో రిజిస్ట్రేషన్ చేయించినట్టు కూడా వార్తలు వచ్చాయి.. విజయ్ పీపుల్స్ మూమెంట్ పార్టీగా రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా సమాచారం. 'ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కల్ ఇయ్యకం' గా విజయ్ పార్టీ పేరు ఉండనుంది అని.. విజయ్ పీపుల్స్ ఉద్యమంగా వున్న సంస్థను పార్టీగా మారుస్తారని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇస్తూ రాజనీకాంత్ వెనక్కి తగ్గడంతో.. హీరో విజయ్ ఎంట్రీ ఖాయమని చర్చ సాగుతోంది.. ఇప్పటికే తమిళనాడు సీఎం పళనిస్వాని కూడా కలిశారు విజయ్.. ఈ నెల 31న పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. జయలలిత సమాధి దగ్గర తన పార్టీ పేరును ప్రకటించేందుకు విజయ్ సన్నాహాలు చేసుకుంటున్నారని తమిళ పొలిటికల్ సర్కిల్‌లో చర్చ సాగుతోంది.. రజనీ పొలిటికల్ ఎంట్రీ.. అళగిరి పార్టీతో డీఎంకే ఓటు బ్యాంక్ చీల్చేలా స్కెచ్ వేశారని టాక్ నడగా.. రజనీ వెనక్కి తగ్గడంతో ఇప్పుడు హీరో విజయ్ పేరు తెరపైకి వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.. మొత్తంగా 31న హీరో విజయ్ పార్టీ ప్రకటిస్తాడని తమిళ పార్టీల్లో చర్చ జోరుగా సాగుతోంది.