మజిలీ కోసం రంగంలోకి దిగిన తమన్

మజిలీ కోసం రంగంలోకి దిగిన తమన్

నాగచైతన్య.. సమంత నటిస్తున్న మజిలీ సినిమా ఏప్రిల్ 5 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాకు ఇప్పటికే పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది.  దీనిని కంటిన్యూ చేస్తూ సాంగ్స్ కూడా ఉండటంతో సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నది.  సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.  

ఇదిలా ఉంటె, ఈ సినిమా కోసం తమన్ రంగంలోకి దిగాడు.  గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తుంటే.. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.  తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మణిశర్మ తరువాత బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించడంలో ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అనే చెప్పాలి. తమన్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.