'మెగా' ఆఫర్ అందుకున్న తమన్

'మెగా' ఆఫర్ అందుకున్న తమన్

ప్రస్తుతం తమన్ టైమ్ నడుస్తుంది. ఏ సినిమా ప్రాజెక్ట్ అయిన తమన్ ను తాకిన తరువాతే బయటికి పోతుందంటే అర్ధం చేసుకువచ్చు మనోడి టైమ్. 'అల వైకుంఠపురంలో' తో వచ్చిన కిక్ తో తమన్ మరిన్ని పెద్ద ఆఫర్లు కూడా అందుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ కు తమనే సంగీతం అందిస్తున్నాడు. దీంతో పాటు మహేష్ 'సర్కారు వారి పాట', ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలు కూడా తమన్ చేతిలోనే ఉన్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ కు మ్యూజిక్ అందించనున్నాడు తమన్. కాగా, చిరు సినిమాకి తమన్ సంగీతాన్ని అందించడం ఇదే తొలిసారి. చిరు 'లూసిఫర్' కు సంగీతం అందించే అవకాశం తనకు వచ్చిన విషయాన్ని తమన్ స్వయంగా బయటపెట్టాడు. ‌చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు నాకు సమయం వచ్చింది, మోహన్‌ రాజాకి కృతజ్ఞతలు అంటూ తమన్‌ ట్వీట్‌ చేశారు. 'ఆచార్య' సినిమా తరువాత చిరు మలయాళ చిత్రం 'లూసిఫర్‌' రీమేక్‌లో నటించనున్న సంగతి తెలిసిందే.