బన్నీ కోసం థమన్ మొదలుపెట్టేశాడు

బన్నీ కోసం థమన్ మొదలుపెట్టేశాడు

అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న కొత్త సినిమా ఇటీవలే ప్రారంభమైంది.  ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నది.  ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.  బన్నీతో కలిసి థమన్ సరైనోడు చేశారు.  కాగా, ఇది రెండో సినిమా.  త్రివిక్రమ్ తో కలిసి అరవింద సమేత చేశాడు థమన్.  ఇందులోని సాంగ్స్ ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  

ఇదిలా ఉంటె, ఈ సినిమా కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించాడు థమన్.  బెస్ట్ మ్యూజిక్ ఇచ్చేందుకు థమన్ ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది.  ఫాథర్ సెంటిమెంట్ సినిమా కావడంతో ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి.  హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.