కొత్త ఛాలెంజ్ ను మొదలు పెట్టిన కొణిదల వారి కోడలు

కొత్త ఛాలెంజ్ ను మొదలు పెట్టిన కొణిదల వారి కోడలు

కరోనా వైరస్‌కు బలైపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చైనాలో విస్తరిస్తున్న ఈ వైరస్ భారత్‌‌లోకి వ్యాపించినట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో డాక్టర్స్కు థ్యాంక్స్ చెప్పే ఉద్దేశ్యంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ థ్యాంక్స్ హెల్త్ హీరోస్ ఛాలెంజ్ ను మొదలు పెట్టారు కొణిదల వారి కోడలు ఉపాసన. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా ట్విట్టర్ లో.. తమ ప్రాణాలను లెక్క చేయకుండా తమ ఫ్యామిలీస్ ను కూడా వదిలి పెట్టి తమ ప్రాణాలను పనంగా పెట్టి ఈ సమయంలో సేవ చేస్తున్న వారికి సెల్యూట్ అంటూ ఒక వీడియోను ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ డైరెక్టర్ జనరల్ అయిన టెడ్రోస్ అదోనమ్ ఉపాసన ట్వీట్ కు సమాధానంగా... థ్యాంక్స్ హెల్త్ హీరోస్ ఛాలెంజ్ లో మీరు భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు. ఇండియా నుండి మీరు ఈ ఛాలెంజ్ ను స్వీకరించడం అభినందనీయం.అని రిప్లే  ఇచ్చారు.