ఆ 12 గ్రామాల ప్రజలకు.. రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు 

ఆ 12 గ్రామాల ప్రజలకు.. రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు 

అక్టోబర్ 21 వ తేదీన మహారాష్ట్రకు ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది.  ఓటర్లకు స్లిప్ లు కూడా ఇప్పటికే జారీ చేసింది.  అయితే, తెలంగాణ, మహారాష్ట్ర బోర్డర్ లో 12 గ్రామాలు ఉన్నాయి.  ఈ 12 గ్రామాల్లో 2,663 మంది ఓటర్లు ఉన్నారు.  ఈ ఓటర్లకు రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంది.  

దీనికి కారణం సరిహద్దు వివాదమే.  1989లో కేంద్రం నియమించిన కేకే నాయుడు కమిషన్‌ను ఈ గ్రామాల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఉంచాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో సమస్య కొనసాగుతూనే ఉన్నది.  అప్పటి నుంచి ఇటు  తెలంగాణలోను, అటు మహారాష్ట్రలోనూ వీరికి ఓటు హక్కు ఉన్నది.  రెండు రాష్ట్రాల ఎన్నికల్లో ఈ 2663మంది ఓటర్లు ఓట్లు చేస్తున్నారు.