అందుకే.. సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలిపాను..

అందుకే.. సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలిపాను..

ఐదు కోట్ల మంది ఆంధ్రులకు అన్యాయం జరుగుతున్నందునే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానని వరంగల్‌కు చెందిన ఉమేష్‌రెడ్డి చెప్పాడు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేస్తూ.. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని సెల్ టవర్ ఎక్కి ఉమేష్‌ ఆందోళన చేశాడు. కొన్ని గంటల తర్వాత అతికష్టం మీద అతడిని పోలీసులు కిందకు దించారు. ఈ సందర్భంగా ఉమేష్‌ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్నదే తన ప్రధాన డిమాండ్ అని చెప్పాడు. తెలంగాణ రాష్ట్రాన్నిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాటిచ్చిందని.. కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఉమేష్‌ చెప్పాడు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికే తాను టవర్‌ ఎక్కి నిరసన తెలిపానని అన్నాడు.