‘ది బిగ్ బాయ్స్ అండ్ ది కిడ్’: దేవరకొండ

‘ది బిగ్ బాయ్స్ అండ్ ది కిడ్’: దేవరకొండ

టాలీవుడ్‌ సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్స్‌ దిల్ రాజు పుట్టిన రోజు నేడు. నేటితో దిల్ రాజ్ 50 వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో బర్త్ డే పార్టీ ఇచ్చారు. 

ఈ పార్టీకి తెలుగు సినీ నటులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. తన బర్త్ డే పార్టీకి కూడా వీళ్లు వాళ్లు అనే తేడా లేకుండా అందర్నీ ఆహ్వానించాడు దిల్ రాజు. హీరోలు కూడా అంతా వచ్చారు. అయితే టాలీవుడ్ అగ్రనటులతో కలిసి దిగిన ఫోటోను ఉద్దేశిస్తూ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ది బిగ్ బాయ్స్ అండ్ ది కిడ్’ అంటూ కామెంట్స్ చేశాడు విజయ్. 

ఇక దిల్ రాజు తన పుట్టినరోజు వేడుకల విషయంలో ఎప్పుడూ ఇంత హడావుడి చేసింది లేదు. ఇదంతా ఈ మధ్యే పెళ్లి చేసుకున్న ప్రభావం కావచ్చు. తన భార్యను ఇండస్ట్రీకి పరిచయం చేయడంతో పాటు మరికొన్ని కారణాలతో రాజు తన పుట్టిన రోజు వేడుకల్ని ఇంత ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తోంది.