భార్య చెల్లి కోసం ఆ చెల్లి భర్తను చంపిన బావ...

భార్య చెల్లి కోసం ఆ చెల్లి భర్తను చంపిన బావ...

తన భార్య  చెల్లికి ఆకర్షితుడైన ఓ బావ తన భర్తను చంపి ఆమెను సొంతం చేసుకోవాలాకున్నాడు... అనుకున్న పని చేసాడు కానీ పోలీసులకు చీకాడు. వివరాల్లోకెళ్తే... సత్యప్రసాద్‌ అనే వ్యక్తి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అతనికి 2006 లో వివాహం జరిగింది. అయితే తన భార్య  చెల్లికి ఈ మధ్యే లక్ష్మణ్ తో వివాహం జరిగింది. అయితే తన మరదలి మీద కనేసిన ఆ బావ దారుణానికి పాల్పడ్డాడు. ఇక్కడ ఉండే బెంగళూరులో ఉంటున్న అతడిని చంపడానికి సిద్ధపడ్డాడు. అయితే అందుకోసం దినేష్ అనే అతనికి డబ్బు ఆశ చూపి లక్ష్మణ్ వివరాలు ఇచ్చాడు. అతడిని చంపడానికి బెంగళూరు వెళ్లిన దినేష్ మొదటి ప్రయత్నం లో విఫలం అయ్యాడు. అందుకే రెండో సారి గ్యాంగ్ ని వేసుకొని వెళ్లి కత్తులతో దాడి చేసి లక్ష్మణ్ ను చంపేశారు. అయితే ఈ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు దినేష్ ను పట్టుకోవడం తో మొత్తం విషయాలు బయటికి  వచ్చాయి. దాంతో సత్యప్రసాద్‌ ను అరెస్ట్ చేశారు పోలీసులు.