టీటీడీపీ కమిటీల కూర్పు ఖరారు

టీటీడీపీ కమిటీల కూర్పు ఖరారు

తెలంగాణ టీడీపీ నేతల భేటీ ముగిసింది. ఈ భేటీలో టీటీడీపీ కమిటీల కూర్పు ఖరారు అయింది. ఎన్నికల సమన్వయ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీలుగా నిర్ణయించారు. ఎన్నికల సమన్వయ కమిటీలో ఎల్.రమణ, దేవేందర్ గౌడ్, రావుల, నామా, రేవూరి, పెద్దిరెడ్డి, మండవలు సభ్యులుగా ఉన్నారు. మేనిఫెస్టో కమిటీలో దేవేందర్ గౌడ్, రావుల, నర్సింహులు, శోభారాణిలు ఉన్నారు. ప్రచార కమిటీలో గరిగపాటి, సండ్ర, కొత్తకోట, అరవింద్ కుమార్, లక్షణ్ నాయక్ లు ఉన్నారు.