ఆ జంటను ఏకం చేసిన ఆర్టికల్ 370 రద్దు..!!

ఆ జంటను ఏకం చేసిన ఆర్టికల్ 370 రద్దు..!!

ఆర్టికల్ 370 రద్దు తరువాత కాశ్మీర్ లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నాయి.  జమ్మూలో ఇప్పటికే పరిస్థితులు దారికొచ్చాయి. అక్కడ జనజీవన స్రవంతి మాములుగా ఉన్నది.  ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్నాయి, పాఠశాలలు తెరుచుకున్నాయి.  అయితే, శ్రీనగర్లో ఇంకా అలాంటి పరిస్థితులు చోటు చేసుకోలేదు.  ఇదిలా ఉంటె, ఆర్టికల్ 370 రద్దు తరువాత కాశ్మీర్ కు చెందిన కామిని రాజ్ పుత్ అనే యువతి ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది.  దీనికి కారణం లేకపోలేదు.  

కామిని రాజ్ పుత్ ఢిల్లీలో తన అత్త ఇంట్లో ఉండగా.. అదే ప్రాంతంలో ఉన్న అక్షయ్ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది.  వీరి పరిచయం ప్రేమగా మారింది.  కానీ, ఆర్టికల్ 370 కారణంగా ఈ ఇద్దరు పెళ్లి చేసుకోలేకపోయారు.  కాశ్మీర్ కు చెందిన అమ్మాయిలు ఇండియాలోని ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే.. వారు వారికున్న ప్రత్యేక హక్కులను కోల్పోతారు.  దీంతో ఈ జంట ప్రేమను బటయకు చెప్పుకోలేదు.  ఆగస్టు 5 వ తేదీన ఎప్పుడైతే ఆర్టికల్ 370 ని రద్దు చేశారో .. అప్పుడే వీరి కళ్ళలో ఆనందం వెల్లివిరిసంది. ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న అక్షయ్ రాజస్థాన్ కు చెందిన వ్యక్తి.  ఇద్దరి సామాజిక వర్గాలు వేరైనా.. ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇరు వర్గాల పెద్దలను ఒప్పించారు.  ఇరు కుటుంబాలు కూడా అందుకు అంగీకరించాయి.  ఈ ఏడాది అక్టోబర్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా రాజస్థాన్ లో జరగబోతున్నది.  కాశ్మీర్ నుంచి వచ్చే అమ్మాయి బంధువుల కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు.