విషాదంలో మునిగిన సుకుమార్...

విషాదంలో మునిగిన సుకుమార్...

టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ విషాదంలో మునిగిపోయారు. ఆయనకు అత్యంత సన్నిహితుడు, ప్రియ మిత్రుడు, తన మేనేజర్ అయిన వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్‌ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న సుకుమార్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు . అయితే ప్రసాద్ ‘అమరం అఖిలం ప్రేమ’ అనే సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. అయితే సుకుమార్ కి అత్యంత సన్నిహితుడైన ప్రసాద్ శనివారం మథ్యాహ్నం ఆయన తీవ్ర గుండె పోటుతో మరణించారు. అయితే సుకుమార్ కు ఎప్పుడు నిరాశ కలిగిన ప్రసాద్ తో మాట్లాడితే చాలు ఆయనకు అదంతా దూరం అయిపోయేదని అంతలా ప్రసాద్ తన జీవితం పై ప్రభావం చూపించాడని సుకుమార్ చాలాసార్లు తెలియజేసారు. సుకుమార్‌కి అత్యంత సన్నిహితమైన వారిలో ఈ ప్రసాద్ ఒకరు. అయితే  ఆయన మరణం తనకి తీరని లోటని, ప్రసాద్ లేని లోటును తన జీవితం లో ఎవరు భర్తీ చేయలేరని సుకుమార్ తెలిపారు. అలాగే వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు సుకుమార్.