మోడీకి లొంగిపోయింది..

మోడీకి లొంగిపోయింది..

కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీకి ఎన్నికల సంఘం దాసోహమైపోయిందని ఆయన ఘాటుగా విమర్శించారు. ఎన్నికల బాండ్లు, ఈవీఎంలు, ఎన్నికల షెడ్యూల్‌ తయారీలో మోసాలు, నమో టీవీ,  మోడీ ఆర్మీ... ఇపుడు కేదార్‌నాథ్‌లో డ్రామా... ఇవన్నీ చూస్తుంటే మోడీ, ఆయన గ్యాంగ్‌ ముందు ఎన్నికల సంఘం దేశ ప్రజల సాక్షిగా లొంగిపోయిందని రాహుల్‌ విమర్శించారు.  ఎన్నికల సంఘం అంటే భయముండాలి, గౌరవముండాలి... కాని అవన్నీ పోయాయని ఆయన ట్వీట్‌ చేశారు.