చివరి అంకంలో వైసీపీ ఎంపీల రాజీనామా ఎపిసోడ్...

చివరి అంకంలో వైసీపీ ఎంపీల రాజీనామా ఎపిసోడ్...

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఎపిసోడ్ చివరి అంకానికి చేరింది. రాజీనామాలు ఆమోదం పొందడమే తరువాయి అంటున్నారు. రీకన్ఫర్మేషన్ లెటర్లు అందగానే రాజీనామాలు ఆమోదించనున్నట్టు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పినట్టు వైసీపీ ఎంపీలు ప్రకటించారు. ఇవాళ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. గత నెల 29న లోక్‌సభ స్పీకర్‌ను కలిసి రాజీనామాలు ఆమోదించాలని కోరిన వైసీపీ ఎంపీలు... నిన్న మరోసారి సుమిత్రా మహాజన్‌తో భేటీ అయ్యారు. రాజీనామాలు వెంటనే ఆమోదించాలని కోరారు. పునరాలోచించుకోవాలని లోక్‌సభ స్పీకర్ కోరినా వైసీసీ ఎంపీలు వెనక్కి తగ్గలేదు. దీంతో ప్రతీఒక్కరు వ్యక్తిగతంలో రీకన్ఫర్మేషన్ లెటర్లు పంపాలని సుమిత్రా మహాజన్ సూచించారు. అవి అందగానే రాజీనామాలు ఆమోదిస్తానని స్పీకర్ తెలిపారు. మరోవైపు వైసీపీ ఎంపీల రాజీనామాలకు విలువ లేదని టీడీపీ విమర్శిస్తోంది.