ఎఫ్‌సీయూకే కార్తిక్ పోస్టర్ వచ్చేసింది

ఎఫ్‌సీయూకే కార్తిక్ పోస్టర్ వచ్చేసింది

గత కొంతకాలంగా అందరిలో చర్చలో ఉన్న సినిమా ఎఫ్‌సీయూకే(ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్). ఈ సినిమా అసలు ఎలా ఉంటుంది. ఎటువంటి కథాంశంతో సినిమా తెరకెక్కనుందన్న అనుమానాలు సినీ ప్రియుల్లో వచ్చాయి. దానికి తోడుగా సినిమా మేకర్స్ కూడా సినిమా ప్రచారంలో భాగంగా రోజుకో పాత్రను రివీల్ చేస్తున్నారు. మొదటగా ఫాదర్ పాత్రలో జగపతిబాబు పోస్టర్‌ను విడుదల చేవారు. రెండోసారి చిట్టి పాత్రలో బేబీ సహశ్రీత పోస్టర్‌కు రిలీజ్ చేశారు. నిన్న ఉమా పాత్ర అమ్ము అభిరామ్ పోస్టర్‌ వచ్చి సినిమాపై అంచనాలను పెంచాయి. నేడు తాజాగా చివరి పాత్రయిన కార్తీక్ పోస్టర్ వచ్చేసింది. ఈ పోస్టర్ చూడగానే కార్తీక్ పాత్ర అల్లరిచిల్లరగా ఉంటుందని అర్థమవుతోంది. కథలో కూడా తన అల్లరితో కూడుకుని ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో రూపొందుతోంది. అలా మొదలైంది లాంటి హిట్ అందుకున్న నిర్మాత దాము తన సొంతం అయిన శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఓ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగనుందని వార్తలు వచ్చాయి. మరి ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.