ఆర్థికవేత్తలతో ఆర్థిక మంత్రి భేటీ

ఆర్థికవేత్తలతో ఆర్థిక మంత్రి భేటీ

వివిధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను, వాటి పరిష్కారాలను తెలుసుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రి బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన నిర్మలా సీతారామన్... ఇవాళ సీనియర్‌ ఆర్థికవేత్తలతో భేటీ అయ్యారు. ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థతిని మదింపు చేస్తూనే... వృద్ధి రేటును పెంచడంతోపాటు ఉపాధి అవకాశాలు పెంచేందుకు గల మార్గాలను కేంద్రం అన్వేషిస్తోంది.  సీనియర్‌ ఆర్థిక వేత్తలతో నిర్మలా సీతారామన్‌ పలు అంశాలపై చర్చ జరిపారు. అలాగే సామాజిక రంగానికి చెందిన ప్రతినిధులతో కూడా ఆర్థిక మంత్రి ఇవాళ భేటీ అయ్యారు.