నిన్న తగ్గింది.. ఇవాళ భారీగా పెరిగింది..

నిన్న తగ్గింది.. ఇవాళ భారీగా పెరిగింది..

పెళ్లిల సీజన్‌ కావడంతో బంగారం ధరలు పైపైకి ఎగబాగుతున్నాయి. నిన్న భారీగా తగ్గిన బంగారం ధర.. ఇవాళ అమాంతం భారీగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇవాళ బులియన్ మార్కెట్‌లో రూ.305  పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.32,690కి చేరింది. మరోవైపు వెండిధర కూడా పెరిగింది. కిలో వెండి ధర రూ.204 పెరగడంతో రూ.38,450కు చేరింది. కాగా, గురువారం బంగారం ధరూ.405 తగ్గింది. ఉన్నట్టుండి ఒకేరోజు భారీగా తగ్గడం.. మరుసటి రోజే మళ్లీ భారీగా పెరిగిపోయింది.