హైదరాబాద్ వచ్చిన అజిత్ విశ్వాసం

హైదరాబాద్ వచ్చిన అజిత్ విశ్వాసం

అజిత్.. శివ కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా విశ్వాసం.  ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  షూటింగ్ చివరిదశకు చేరుకున్నది.  దీనికి సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది.  ఈరోజు నుంచి విశ్వాసం చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కాబోతున్నది.  చెన్నై నుంచి యూనిట్ హైదరాబాద్ వచ్చి ఇక్కడ షూట్ చేస్తున్నారు.  ఇప్పటికే దర్శకుడు శివ వీరం, వేదాళం, వివేగం వంటి సినిమాలు అజిత్ తో చేశారు.  ఈ మూడు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో.. నాలుగో సినిమా కూడా ఆయనతోనే కమిట్ అయ్యారు.  ఈ సినిమా తరువాత దర్శకుడు వినోద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.  దీనికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నట్టు తెలుస్తున్నది.  మిగతా వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.