వైరల్: పామును వివాహం చేసుకున్న యువకుడు... ఇదే కారణం...!!

వైరల్: పామును వివాహం చేసుకున్న యువకుడు... ఇదే కారణం...!!

2020 వ సంవత్సరంలో ఎన్నో చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. తెలియని ఎన్నో విషయాలను ఈ 2020 తెలియజేస్తోంది.  మహమ్మారి, భూకంపాలు, ఆకలి, కరోనా మరణాలు, ఉద్యోగాలు కోల్పోవడం ఇలా ఒకటికాదు రెండు కాదు ఈ ఏడాది ఎన్నింటినో చూస్తున్నాం.  అయితే, 2020 మరో విచిత్రం చోటు చేసుకుంది.  ఐదేళ్ల క్రితం మరణించిన తన ప్రియురాలు తిరిగి పాము రూపంలో జన్మించిందని భావించిన ఓ వ్యక్తి ఆ పామును వివాహం చేసుకున్నాడు.  పాముతోనే కలిసి జీవిస్తున్నాడు.  అయితే, ఆ కోబ్రా పాము కూడా అతనిని ఏమి అనడం లేదు. చూసేవాళ్లంతా షాక్ అవుతున్నారు.  పాముతో కలిసి జీవించడం ఏంటి... ఏమైనా పిచ్చిపట్టిందా అని తిట్టిపోతున్నారు.  అయినప్పటికీ ఆ వ్యక్తి మాత్రం మరణించిన తన ప్రియురాలు ఈ జన్మలో పాముగా పుట్టిందని, దానితోనే కలిసి ఉంటానని అంటున్నాడు.  ఈ సంఘటన థాయిలాండ్ లో జరిగింది.