లొంగిపోయిన మావోయిస్టు దంపతులు

లొంగిపోయిన మావోయిస్టు దంపతులు

వరంగల్ సీపీ ప్రమోద్ కుమార్ ఎదుట మావోయిస్టు దంపతులు యాలం నరేందర్ అలియాస్ సంపత్, పొడియం దేవి లొంగిపోయారు. ములుగు జిల్లా వెంకటాపురం ఏరియా కమాండర్, యాక్షన్ టీమ్ కమాండర్ గా యాలం నరేందర్ పనిచేస్తున్నాడు.  దళ సభ్యురాలుగా దేవి పనిచేస్తుంది. యాలం నరేందర్ సంపత్ 2005 నుండి మావోయిస్టు కార్యకలాపాల్లో ఉన్నాడు. చత్తీస్ ఘడ్ రాష్ట్రం ఇతని స్వస్థలం కాగా, దేవిది ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం. బాంబు స్క్వాడ్, కమ్యూనికేషన్ టెక్నాలజీ లో సంపత్ ఎక్స్ పర్ట్ ఇతనిపై ఇప్పటికే 6 పైగా కేసులు ఉన్నాయి. తెలంగాణలో జరిగిన పలు బాంబ్ బ్లాస్ట్ ల్లో కీలక నిందితుడు. 2020లో 7 మంది కీలక మావోయిస్టులు లొంగిపోయారు. వీళ్ళు మొదట ప్రజలకు సేవ పేరుతో మావోయిస్టు కార్యకలాపాలకు ఆకర్షితులైనరు. ఇప్పుడు పార్టీ సిద్ధాంతాలపై నమ్మకం పోవడం, పోలీసులు, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకలతో బయటకు వస్తున్నారు. ఈ రోజు లొంగిపోయిన సంపత్ కు 4 లక్షలు, దేవికి 1 లక్ష రివార్డు ఈ రోజే అందజేశామని సీపీ ప్రమోద్ కుమార్ తెలిపారు.