ఈ శతాబ్దపు అతిపెద్ద మహమ్మారి క్యాన్సర్

ఈ శతాబ్దపు అతిపెద్ద మహమ్మారి క్యాన్సర్

చాపకింద నీరులా వ్యాపిస్తున్న క్యాన్సర్ ప్రపంచ ప్రజలందరినీ భయకంపితుల్ని చేస్తోంది. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్సీ) తాజా రిపోర్టు చూసిన ఎవరికైనా గుండెలు జారిపోవడం ఖాయం. అందులోని ముఖ్యాంశాలేంటో చూడండి.
- ఈ సంవత్సరం క్యాన్సర్ తో కోటి మంది చనిపోయే ప్రమాదం ఉంది.
- ఈ సంవత్సరం కోటీ 80 లక్షలకు పైగా కొత్తవారు క్యాన్సర్ బారిన పడే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరమే 96 లక్షల మరణాలు సంభవించే ప్రమాదం ఉంది.
- ఈ సంవత్సరపు క్యాన్సర్ మరణాల అంచనా పాత అంచనాలను మించిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. 
- 2012లో ఐఏఆర్సీ ఆఖరుసారిగా కేన్సర్ మరణాలపై మదింపు వేసింది.
- 2012లో కోటీ 41 లక్షల మంది కొత్తగా కేన్సర్ బారిన పడతారని, 82 లక్షల మరణాలు సంభవిస్తాయని అంచనా వేయగా.. తాజా అంచనా మరీ ఊహకందకుండా మించిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఆహార అలవాట్లు మారిపోవడం, ఎక్సర్ సైజులు చేయకపోవడం, పొగతాగడమే ప్రధాన కారకాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. హెల్తీ డైట్ తో పాటు వ్యాధి నిరోధక చర్యల్ని ముందు నుంచే తీసుకున్నవారిలో ఆ సంభావ్యత తగ్గుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందని.. కానీ ఓవరాల్ గా క్యాన్సర్ మాత్రం దారుణంగా వ్యాపిస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు.