రాధేశ్యామ్ టీజర్ ఆలస్యానికి కారణం అదేనంట..?

రాధేశ్యామ్ టీజర్ ఆలస్యానికి కారణం అదేనంట..?

రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా భారీ సినిమాలు చేస్తున్నారు. వాటిలో రాధేశ్యామ్ కూడా ఒకటి. ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాధేశ్యామ్ టీజర్ అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుందని వార్తలు వచ్చినా టీజర్ విడుదల కాకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ సినిమా టీజర్‌ సంక్రాంతికి వస్తుందని అనుకున్న అభిమానులు టీజర్ రాకపోవడంతో అసహనం ప్రకటిస్తూ ప్రొడక్షన్ బ్యానర్‌ను ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. అయితే రాధేశ్యామ్ టీజర్‌ కోసం తయారు చేసిన వీడియో క్లిప్ ప్రభాస్‌కు అంతగా నచ్చలేదని, దాంతో టీజర్‌లో ప్రభాస్ మార్పులు చెప్పారని అందుకనే టీజర్ ఆలస్యం అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా కొత్త టీజర్‌ను సిద్దం చేస్తున్నారంట. అన్ని అనుకున్న విధంగా జరిగితే ఫిబ్రవరి14న టీజర్‌ అభిమానుల ముందుకు వస్తుందని సినీవర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు. మరి వాలెంటెన్స్ డే రోజుకైనా టీజర్ కచ్ఛితంగా వస్తుందేమో వేచి చూడాలి.