ఒంగోలులో దారుణం... 108కు నిప్పంటించిన రౌడీషీటర్‌

ఒంగోలులో దారుణం... 108కు నిప్పంటించిన రౌడీషీటర్‌

ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఓ రౌడీషీటర్ వీరంగం సృష్టించాడు. ఒంగోలు పోలీస్ స్టేషన్ సమీపంలో 108 అంబులెన్స్ కు రౌడీషీటర్ నిప్పుపెట్టాడు. స్థానికంగా ఉండే రౌడీషీటర్ సురేష్ఇ టీవల పదేపదే డయల్ 100కి రాంగ్ కాల్స్ చేశాడు. అంతేకాకుండా పిఎస్ కు వచ్చి తనను అరెస్టు చేయాలంటూ తలుపులు పగలగొట్టి హంగామా చేశారు. గాయాలు కావడంతో పోలీసులు 108కి పోన్ చేశారు. 108 వాహనం ఎక్కి వాహనం అద్దాలు పగలగొట్టి, వాహనంలో ఉన్న స్పిరిట్ తో 108కి నిప్పుపెట్టి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేష్ మానసిన పరిస్థితి బాగోలేదని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న రౌడీషీటర్ కోసం గాలిస్తున్నారు.