అభిమానులకు శిఖర్ ధవన్ భావోద్వేగ సందేశం

అభిమానులకు శిఖర్ ధవన్ భావోద్వేగ సందేశం

ఓపెనింగ్ బ్యాట్స్ మెఓన్ శిఖర్ ధవన్ రూపంలో టీమిండియాకు పెద్ద దెబ్బ తగిలింది. శిఖర్ ధవన్ వరల్డ్ కప్ 2019లో ఇక ఆడబోడు. ఆస్ట్రేలియాతో సెంచరీ ఇన్నింగ్స్ ఆడినపుడు శిఖర్ ధవన్ చేతికి గాయమైంది. శిఖర్ మరో రెండు వారాల్లో గాయం నుంచి కోలుకుంటాడనే వార్తలు వచ్చాయి. కానీ బుధవారం అధికారికంగా అతను వరల్డ్ కప్ లో ఆడబోడని స్పష్టం చేశారు.

వరల్డ్ కప్ 2019 మధ్యలోనే వీడాల్సి రావడంపై టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధవన్ ఎమోషనల్ అయ్యాడు. దీని గురించి ధవన్ ట్వీట్ కూడా చేశాడు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో 'నేను ఇక క్రికెట్ వరల్డ్ కప్ 2019లో భాగం కానని ప్రకటిస్తున్నాను. దురదృష్టవశాత్తు ఎడమచేతి బొటనవేలికైన గాయం సమయంలోగా మానలేదు. కానీ షో మస్ట్ గో ఆన్' అని రాశాడు.

శిఖర్ ధవన్ ఈ పోస్టులో వీడియో కూడా షేర్ చేశాడు. ఈ వీడియోకి శీర్షికలో రాస్తూ 'నా జట్టు సహచరులు, క్రికెట్ ప్రేమికులు, మొత్తం దేశం నుంచి ఇంత ప్రేమ, మద్దతు పొందుతున్నందుకు నేనెంతో అదృష్టవంతుడిని' అని పేర్కొన్నాడు. పోస్ట్ చివరలో జై హింద్ అని కూడా రాశాడు.

Click on the link to see the video: https://twitter.com/SDhawan25/status/1141351063381041157