వైరల్: భర్తను కట్టేసి చితకబాదిన భార్య... ఇదే కారణమా?

వైరల్: భర్తను కట్టేసి చితకబాదిన భార్య... ఇదే కారణమా?

ఇంటికి తాగొచ్చిన భర్త డబ్బుకోసం, కావాల్సింది తినడం కోసం భార్యను హింసిస్తుంటారు.  భార్యపై చేయి చేసుకుంటుంటారు.  కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది.  ఇంటికి తాగొచ్చిన భర్త గొడవ చేస్తుంటే, ఆ ఇల్లాలుకి కోపం వచ్చింది.  సహనం నశించింది.  వెంటనే భర్తను తాడుతో కాళ్ళు చేతులు కట్టేసింది.  లావుపాటి దుడ్డు కర్రతో తాగొచ్చిన భర్తను మత్తు వదిలే వరకు పిచ్చ కొట్టుడు కొట్టింది.  దెబ్బకు తాగిన మత్తు దిగింది.  ఇకపై తాగిరాను కొట్టొద్దు అని వేడుకున్నా ఆ భార్య వదలలేదు.  కోపం చల్లారే వరకు ఉతికి ఆరేసింది.  దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ప్రతి మహిళ ఇలా ధైర్యసాహసాలు ప్రదర్శిస్తే, ఏ భర్త కూడా తాగి ఇంటికి రాడని, సంసారం సుఖంగా సాగుతుందని అంటున్నారు నెటిజన్లు.