కోవిడ్‌ వైరస్‌ ఎఫెక్ట్‌ : ఆ వరల్డ్‌ ఫెయిర్‌ రద్దు

కోవిడ్‌ వైరస్‌ ఎఫెక్ట్‌ : ఆ వరల్డ్‌ ఫెయిర్‌ రద్దు

కోవిడ్‌ వైరస్‌ ప్రమాదంతో ప్రపంచ దేశాలు భయపడుతున్నాయ్‌. ఈ వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచదేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్‌ వరల్డ్‌ ట్రేడ్‌ మొబైల్‌ ఫెయిర్‌ మీద పడింది. ఫిబ్రవరి 24 నుంచి 27 వరుకు నాలుగురోజుల పాటు జరిగే ప్రపంచంలోనే అతి పెద్దదైన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌కి బార్సిలోనా వేదికైంది.  ఐతే, కరోనా వైరస్‌ భయంతో ఈ ఫెయిర్‌ క్యాన్సిల్‌ అయింది.  ఎరిక్సన్‌, అమెజాన్‌, సోనీ, ఇంటెల్‌ లాంటి దిగ్గజ సంస్థలు ఈ ఫెయిర్‌లో పాల్గొనడం లేదని ప్రకటించాయి. తమ ఉద్యోగులు, ఇతరత్రా ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ ఫెయిర్‌కి దూరంగా ఉండాలని కంపెనీలు భావించాయ్‌. దీంతో మొబైల్‌ వరల్డ్ కాంగ్రెస్‌ రద్దయింది.