మద్యం షాపులో చోరీ.. ఆ బ్రాండ్ మాత్రమే ఎత్తుకెళ్లారు..!!

మద్యం షాపులో చోరీ.. ఆ బ్రాండ్ మాత్రమే ఎత్తుకెళ్లారు..!!

ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాల నిర్వహణను ప్రభుత్వం తీసుకున్న సంగతి తెలిసిందే.  అక్టోబర్ 1 వ తేదీ నుంచి మద్యం షాపుల నిర్వహణను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ప్రతి వ్యక్తికీ మూడు బాటిళ్ల మద్యం సీసాల కంటే ఎక్కువగా ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.  

మందుబాబులకు మద్యం సరిపోలేదేమో.. ప్రకాశం జిల్లాలోని కంభంలోని ఓ మద్యం షాపుకు కన్నం వేశారు.  రేకుల షెడ్డులో ఉన్న మద్యం షాపు రేకులకు కన్నం వేసి లోపలికి వెళ్లి తమకు కావాల్సిన ఎంసి విస్కీ బ్రాండ్ కేసును దొంగతనం చేశారు.  మరుసటిరోజు యధావిధిగా షాపు తెరిచి చూసి షాక్ అయ్యారు.  పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.