ఆస్తికులే ఎక్కువకాలం జీవిస్తారు..

ఆస్తికులే ఎక్కువకాలం జీవిస్తారు..

నాస్తికుల కంటే ఆస్తికులు దాదాపు నాలుగు సంవత్సరాలు ఎక్కువగా జీవిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి.  దైవ భక్తి ఉన్నవాళ్లకీ, పూజలు పునస్కారాలపై నమ్మకలేని వారికీ మధ్య జీవన విధానంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని ఆ పరిశోధనల్లో తేలింది. ఒహియో యూనివర్శిటీ సైకాలజీ అసోషియేట్ ప్రొఫెసర్ తో కూడిన ఓ టీమ్  నాస్తికులు, ఆస్తికులపై పరిశోధన జరిపారు. సుమారు 1500 వందల మందిని అభిప్రాయాలను సేకరించారు. అందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.  నాస్తికులకు సామాజిక మద్ధతు కూడా తక్కువగా ఉంటుందని తెలిసింది. ఒత్తిడిని అధికమించేందుకు సలహాలు ఇచ్చేవారు వారికి తక్కువగా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి. అనారోగ్యానికి గురిచేసే అలవాట్లు ఎక్కువగా ఉంటాయని తేలింది. ఇద్దరి మతపరమైన విషయాలు, వివాహ సంబంధాలు, రోజు వారి కార్యక్రమాలు, అలావాట్లు, అభిరుచులు లాంటి వివిధ అంశాలపై పరిశోధలు చేశారు. ఈవిషయాలను "సోషియల్ సైకాలాజికల్ అండ్ పర్సనాలిటీ సైన్స్" లో పబ్లిష్ చేశారు. మతపరమైన వారు అప్పుడప్పుడు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది ఒంటరి తనాన్ని పోగొట్టేందుకు చాలా ఉపయోగపడుతుంది. వారి జీవన విధానాన్ని కూడ మార్చుతోంది. పలువురితో కలవటంతో జీవన విధానంలో సంతృప్తి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పలు జబ్బులకు దూరం అవుతున్నారు. దీంతో వారి ఆయుష్షు కూడా పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది