అర్హత పరీక్షల్లో ఎలాంటి రిజర్వేషన్ వీలు కాదు

అర్హత పరీక్షల్లో ఎలాంటి రిజర్వేషన్ వీలు కాదు

'అర్హత పరీక్షల్లో ఎలాంటి రిజర్వేషన్ ఉండరాదని' సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది. సోమవారం సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్)-2019లో ఆర్థిక వెనుకబడిన వర్గాలకు 10 శాతం కోటా కేటాయించాలని కోరుతూ దాఖలైన విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ స్పష్టీకరణ ఇచ్చింది. కేవలం ప్రవేశ సమయంలోనే ఏ తరగతికైనా రిజర్వేషన్ వర్తిస్తుందని జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్ ఖన్నాల వెకేషన్ బెంచ్ చెప్పింది.

జూలై 7న జరగబోయే సీటెట్ పరీక్ష నోటిఫికేషన్ ను పిటిషనర్ రజనీష్ కుమార్ పాండే, ఇతరుల తరఫు న్యాయవాది ఉటంకించగా 'పరీక్షకు ఇచ్చిన నోటిఫికేషన్ లో షెడ్యూల్డ్ జాతులు, షెడ్యూల్డ్ తరగతులకు కూడా ఎలాంటి రిజర్వేషన్ ఇవ్వలేదని' బెంచ్ గుర్తు చేస్తూ ధర్మాసనం పిటిషన్ ను కొట్టి వేసింది. అయితే పిటిషనర్ తరఫు లాయర్ దీనిని పరిశీలనకు స్వీకరించాల్సిందిగా కోరగా మే 16న విచారణ జరిపేందుకు అంగీకరించింది.