ఎక్కువ కాలం జీవించాలంటే ఇవి తినండి

ఎక్కువ కాలం జీవించాలంటే ఇవి తినండి

భౌతిక అవసరాల మీద అనేక పరిశోధనలు జరుగుతున్నట్టే ఆరోగ్యకరమైన జీవితకాలాన్ని పొడిగించేందుకు నిపుణులు ఎన్నో అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. అందులో ఒకటే మెడిటరేనియన్  డైట్ అనాలిసిస్. జనమంతా నోరూరించే నెగెటివ్ ఫుడ్ వైపే పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో సాత్వికాహారం మీద ప్రయోగాలు జరగడం ఒక ఎత్తయితే.. దాని అవసరాన్ని గుర్తించి ప్రజలకు వివరించడం మరొక ఎత్తు. ఈ క్రమంలోనే ఇటలీలోని మెడిటరేనియన్ న్యూరోమెడ్ ఇనిస్టిట్యూట్ వైద్య నిపుణులు సుదీర్ఘమైన అధ్యయనాన్ని నిర్వహించారు. 

స్టడీలోని అంశాలు:
65 ఏళ్లు, ఆ పైబడ్డ వయసున్న వారి ఆహార అలవాట్లు నోట్ చేసుకొని.. ఆ తరువాత మెడిటరేనియన్ ఫుడ్ ను చాలా పరిమితంగా ఇస్తూ ఫలితాలను స్టడీ చేశారు. మొత్తం 5200 మందికి మెడిటరేనియన్ ఫుడ్ ఇవ్వడానికి ముందు వారి హ్యాబిట్స్, ఆరోగ్య పరిస్థితులు నోట్ చేసుకొని, ఆ ఫుడ్ ఇచ్చిన తరువాత మరోసారి రిపోర్టు తీసుకున్నారు. మెడిటరేనియన్ ఫుడ్ ఇవ్వడం మొదలు పెట్టిన తరువాత జీవిత కాలాల్లో తేడాలను నమోదు చేశారు. 2005 నుంచి 2010 వరకు వారికి మెడిటరేనియన్ ఫుడ్ ఇచ్చి, 2015 వరకు వారి ఆరోగ్య పరిస్థితుల మీద అధ్యయనం చేశారు. వారి అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వారి దృష్టికి వచ్చాయి. ఇటీవలే ఆ వివరాలు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ మేగజైన్లో అచ్చయ్యాయి. 

మెడిటరేనియన్ ఫుడ్ అంటే ఏమిటి?:
మెడిటరేనియన్ ఫుడ్ అంటే మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఉండే ప్రజల ఆహార అలవాట్లు అని చెప్పుకోవచ్చు. బాగా ఉడికించడం, డీప్ ఫ్రై చేయడం, రుచి కోసం సాధారణ నూనెల్లో బాగా వేయించడం, కొవ్వు పదార్థాలు ఉపయోగించడం వంటివి ఇందులో ఉండవు. మెడిటరేనియన్ ఫుడ్ లో తృణ ధాన్యాల వాడకం అధికంగా ఉంటుంది. బ్యాడ్ కొలెస్టరాల్ కు దారితీసే స్యాచురేటెడ్ ఫ్యాట్స్ కు బదులు మోనో అన్ స్యాచురేటెడ్ ఫ్యాట్ ను ఇస్తారు. ఆకుకూరలు, కూరగాయలు, పళ్లు, డ్రైఫ్రూట్స్, ఫిష్, లీన్ మీట్ (స్కిన్ లెస్ చికెన్, పోర్క్ చాప్స్ వంటివి కొద్దిగా), ఆలివ్ ఆయిల్, ఫైబర్ రిచ్ ఇంగ్రీడియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కంటెంట్ వాడుతారు. 

వారి అధ్యయనంలో తేలిందేమంటే.. ఒక పాయింట్  మెడిటరేనియన్ ఫుడ్ తీసుకున్నవారిలో రిస్క్ ప్రభావం 5 శాతం తగ్గింది. జీవితకాలం పెరగడమే కాక మరణానికి చేరువ చేసే రోగాల పీడ బాగా తగ్గిందని, ఇంకా ముఖ్యంగా గుండెజబ్బుల ప్రభావం గణనీయంగా తగ్గిందని గమనించారు. అయితే ఈ అధ్యయనం 65 ఏళ్ల పైబడ్డవారికే పరిమితం చేశారు కాబట్టి.. యువతీ యువకుల్లో ఆ ఫుడ్ ప్రభావం ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందో దీని ద్వారా అసెస్ చేయలేమన్నారు. అంటే వృద్ధుల్లోనే 5 శాతం మెరుగైన ఫలితాలు వస్తే.. యూత్ లో ఇంకా ఎక్కువ ఫలితాలు వస్తాయని అర్థం చేసుకోవచ్చు. అయితే అది అధ్యయనంలో తేలాకే కన్ఫామ్ చేస్తామంటున్నారు నిపుణులు.