ట్రెండ్ మార్చిన యంగ్ డైరెక్టర్స్ వీరే..!!

ట్రెండ్ మార్చిన యంగ్ డైరెక్టర్స్ వీరే..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక మంది డైరెక్టర్స్ వస్తుంటారు.. సినిమాలు చేస్తుంటారు.  కొంతమంది మాత్రమే సినిమా ఇండస్ట్రీలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారు. మంచి సినిమాలు చేస్తూ.. నిర్మాతలకు, హీరోలకు మంచి పేరు తీసుకొస్తుంటారు.  

అలా మంచి పేరు తీసుకొస్తున్న దర్శకులు వంశి పైడిపల్లి, క్రిష్, నాగ్ అశ్విన్, శ్రీరామ్ ఆదిత్య అని వైజయంతి మూవీస్ అధినేత సి అశ్వినీదత్ పేర్కొన్నారు.  టాలీవుడ్ సినిమా ట్రెండ్ మారుతున్నది.  ఈ ట్రెండ్ కు అనుగుణంగా సినిమాలు చేస్తూ ఈ దర్శకులు మంచి పేరు తెచ్చుకుంటున్నారని అన్నారు.