హిట్ కొట్టాల్సిన సమయంలో....

హిట్ కొట్టాల్సిన సమయంలో....

టాలీవుడ్ లో టాలెంట్ కు కొదవలేదు.  టాలెండ్ ఉన్న దర్శకులు చాలామంది తమ టాలెంట్ ను నిరూపించుకొని అవకాశాలు దక్కించుకుంటున్నారు.  మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన శివ నిర్వాణ, గౌతమ్ తిన్ననూరి వంటి దర్శకులు రెండో ప్రయత్నం కూడా విజయవంతం అయ్యింది.  మూడో సినిమాగా ఎవరితో చేస్తున్నారో తెలియాలి.  

ఇక టాలెంట్ ఉంది ఇప్పటికే సినిమాలు చేసిన యువ దర్శకులు చాలామంది సినిమా కోసం ట్రై చేస్తున్నారు.  ఇలాంటి వ్యక్తుల్లో మారుతి ఒకరు.  భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన మారుతి ఆ తరువాత నాగచైతన్యతో శైలజా రెడ్డి అల్లుడు చేశాడు.  ఈ సినిమా అనుకున్న విధంగా సక్సెస్ కావడంతో మారుతి కెరీర్ డైలమాలో పడింది.  అల్లు అర్జున్ తో సినిమా చేస్తానని చెప్తున్నా అది కార్యరూపం దాలుస్తుందో లేదో తెలియాలి.  

కార్తికేయ, ప్రేమమ్ వంటి బెస్ట్ హిట్స్ ఇచ్చిన చందు మొండేటి మూడో సినిమా సవ్యసాచి ప్లాప్ అయ్యింది.  దీంతో చందు మొండేటి నెక్స్ట్ సినిమా ఏంటన్నది ఇప్పటి వరకు తెలీదు.  దర్శకులు విఐ ఆనంద్, సంతోష్ శ్రీవాస్ లు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు.  మాస్ మహారాజ రవితేజతో ఈ ఇద్దరు సినిమాలు చేయాల్సి ఉంది.  రెండు సినిమాలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో ఎదురుచూస్తున్నారు.  వీళ్ళే కాదు ఇంకా చాలామంది దర్శకులు ఇలాగే ఎదురుచూస్తున్నారట.