ఏప్రిల్ 1 తరువాత ఆ 5 బ్యాంకులు కనిపించవు...

ఏప్రిల్ 1 తరువాత ఆ 5 బ్యాంకులు కనిపించవు...

కేంద్ర ఆర్ధిక శాఖ గతంలో దేశంలోని కొన్ని ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  ఈ బ్యాంకుల విలీనం ప్రక్రియకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది.  దీంతో ఏప్రిల్ 1 వ తేదీ నుంచి బ్యాంకులు విలీనం కాబోతున్నది.  ఓరియంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో విలీనం అవుతుండగా, సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్ లో విలీనం అవుతున్నది.  అదే విధంగా ఆంద్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అవుతున్నాయి.  అలహాబాద్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ లో విలీనం అవుతున్నది.  

ఈ విలీనం ప్రక్రియ పూర్తయితే దేశంలో 7 పెద్ద బ్యాంకులు, ఐదు చిన్న బ్యాంకులు మిగులుతాయి.  విలీనానికి ముందు దేశంలో 27 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉండేవి.  ఇక విలీనం పూర్తయితే దేశంలో ఎస్బిఐ తరువాత అతి పెద్ద బ్యాంక్ గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవతరిస్తుంది.  దీని తరువాత బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనెరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ లు ఉంటాయి.  ఇక ఏప్రిల్ 1 నుంచి ఓరియంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఆంద్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ లు కనిపించవు.