ఈ నటులంతా చిన్నవయసులోనే.. ఎందుకలా..!! 

ఈ నటులంతా చిన్నవయసులోనే.. ఎందుకలా..!! 

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని అందరికి ఉంటుంది.  అలా అడుగుపెట్టిన తరువాత కొందరే విజయం సాధిస్తారు.  ఆ కొందరిలో కూడా ఎక్కువకాలం సినిమా ఇండస్ట్రీలో ఉండి మంచి పేరు తెచ్చుకునే వ్యక్తులు కొందరు ఉంటారు.  అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొద్దికాలంలోనే మంచి పేరు తెచ్చుకొని ... హఠాత్తుగా వివిధ కారణాలతో మరణించిన నటీనటులు ఎందరో ఉన్నారు.  ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చెరగని ముద్రను వేసి తక్కువ వయసులోనే ఈ లోకాన్ని వదిలి వెళ్లిన నటీనటులు ఎవరో తెలుసుకుందాం.  

స్టార్ కమెడియన్ రాజబాబు గురించి అందరికి తెలుసు.  అయన చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోనే మంచి పేరు తెచ్చుకున్నారు.  45 సంవత్సరాల వయసులోనే కన్ను మూశారు.  మహానటిగా తెలుగు సినిమా రంగానికి సుపరిచితమైన సావిత్రి 45 సంవత్సరాల వయసులోనే మరణించింది.  సుత్తి పేరుతో తెలుగు సినిమా ఇండస్ట్రీని కితకితలు పెట్టిన వీరభద్రరావు కేవలం 42 ఏళ్ల వయసులోనే ఓ సినిమా షూటింగ్ లో గుండెపోటు వచ్చి మరణించారు.  ఐరెన్ లెగ్ శాస్త్రిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఆయన 40 సంవత్సరాల వయసులోనే కన్ను మూయడం బాధాకరం.  సిల్క్ స్మిత 36 ఏళ్ళ వయసులోనూ, దివ్యభారతి 19 సంవత్సరాల వయసులోనూ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.  అభినవ సావిత్రిగా పేరు తెచ్చుకున్న సౌందర్య కూడా 32 సంవత్సరాల వయసులో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించింది.  రియల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న శ్రీహరి 49 సంవత్సరాల వయసులో లివర్ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మరణించారు.  ఇప్పుడు వేణు మాధవ్ కూడా 49 సంవత్సరాల వయసులోనే మరణించడం బాధాకరం. హీరోయిన్ ఆర్తి అగర్వాల్, హీరో ఉదయ్ కిరణ్ లు కూడా చిన్న వయసులోనే అనుమానాస్పద రీతిలో మరణించారు.