శవం అంటూ పోలీసులకు ఫోన్..తీరా చూస్తే..

శవం అంటూ పోలీసులకు ఫోన్..తీరా చూస్తే..

ఫ్లోరిడా: ప్రతిరోజు ప్రపంచంలో ఎదోఒక వింత జరుగుతుంటుంది. అవి మనచేత ఎక్కడ? ఏంటి! ఎలా? అన్నమాటలను అనేలా చేస్తాయి. నమ్మకం లేదా అయితే ఇప్పడు అలాంటి ఓ సంఘటన గురించి తెలుసుకుందాం. ఈ ఘటన ఫ్లోరిడాలోని పెర్డిడో అనే బీచ్‌లో జరిగింది. అక్కడ ఒకామె సముద్రపు ఓడ్డున నడుచుకుంటూ వెళుతోంది. ఒక్కసారిగా షాక్ ఎందుకంటే అక్కడ సముద్రం నుంచి కొట్టుకొచ్చిన ఓ మృతదేహం కనిపించింది. దాంతో పెద్దగా కేక వేసి అలానే షాక్‌లో చూస్తూ ఉండిపోయింది. ఇంతలో పక్కనే ఉన్న ఒకరు పోలీసులకు ఫోన్ చేసి అక్కడ వారు చూసింది చెప్పారు. దాంతో పోలీసులు హుటాహటీన వచ్చారు. అక్కడికి పోలీసులు వచ్చాక అసలు విషయం బయట పడింది. ఆ శవం చాలా రోజుల పాటు సముద్రంలో ఉండే సరికి దానికి బాగా సముద్రపు పాచి పట్టుకొని ఉంది. దాంతో పోలీసులు దాన్ని బాగా పరిశీలించి చెప్పారు. ఏమనంటే.. అది శవం కాదు ఓ బొమ్మ అని ఆ మాటతో అక్కడి వారు మళ్ళీ షాక్ తిన్నారు. అయితే ఈ విషయాన్ని వారు ఫేస్‌బుక్ ద్వారా అందరితో పంచుకున్నారు. దీనికి భారీగా రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 3,300 రీఫేర్‌లతో పాటు 2,500 రియాక్షన్‌లతో చూసిన వారు తమతమ ఆశ్చర్యాన్ని తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.