ఇంకో హీరోయిన్ కూడానా రాజా ?

ఇంకో హీరోయిన్ కూడానా రాజా ?

మాస్ మహారాజ చేస్తున్న కొత్త సినిమా 'డిస్కో రాజా'.  ఇందులో రవితేజ విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తాడని ఆసక్తి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  ఇదిలా ఉండగా ఇప్పటికే సినిమాలో మొదటి కథానాయకిగా పాయల్ రాజ్ ఫుత్ ఫైనల్ కాగా రెండవ కథానాయకిగా నభ నటేష్ ను తీసుకున్నారు.  వీరిద్దరూ కాకుండా ఇందులో మూడో హీరోయిన్ పాత్ర కూడా ఉందట.  ఆ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలా అని వెతుకుతున్నారట దర్శక నిర్మాతలు.  ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.  మార్చి మొదటి వారం నుండి సినిమా మొదలుకానుంది.