రవితేజ సినిమాలో మూడో హీరోయిన్ !

రవితేజ సినిమాలో మూడో హీరోయిన్ !

మాస్ మహారాజ రవితేజ తన నెక్స్ట్ సినిమాను దర్శకుడు విఐ ఆనంద్ తో కలిసి చేయనున్న సంగతి తెలిసిందే.  త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.  ఈ సినిమాల్లో హీరోయిన్లుగా ఇప్పటికే నాభా నటేష్, పాయల్ రాజ్ పుత్ లు ఫైనల్ కాగా ఇప్పుడు మూడో హీరోయిన్ ను కూడ సెలెక్ట్ చేసుకున్నారు దర్శక నిర్మాతలు.  ఆమె మరెవరో కాదు ఇటీవలే విడుదలైన విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' చిత్రంలో మెరిసిన ప్రియాంక జవాల్కర్.  రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'డిస్కో రాజా' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.