ముగిసిన మూడో విడత పోలింగ్..

ముగిసిన మూడో విడత పోలింగ్..

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన మూడో దశ పోలింగ్ ముగిసింది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం సాయంత్రం 5.30 గంటల వరకు దేశ వ్యాప్తంగా సగటున 61.31 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 78.94 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా జమ్మూ కశ్మీర్‌లో 12.46 శాతం నమోదైంది.

వివిధ రాష్ట్రాల్లో సాయంత్రం 5.30 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం:

* అస్సాం- 74.05
*బీహార్- 54.95
*ఛత్తీస్ గడ్- 64.03
*దాద్రా అండ్ నగర్ హవేలీ- 71.43
*డామన్ అండ్ డయూ- 65.34
*గోవా- 70.96
*గుజరాత్- 58.81
*జమ్ము కాశ్మీర్- 12.46
*కర్నాటక- 60.87
*కేరళ- 68.62
*మహారాష్ట్ర- 55.02
*ఒడిషా- 57.84
*త్రిపురా- 71.13
*ఉత్తరప్రదేశ్- 56.36
*వెస్ట్ బెంగాల్- 78.94