ప్రశాంతంగా మూడో విడత పరిషత్ ఎన్నికలు

ప్రశాంతంగా మూడో విడత పరిషత్ ఎన్నికలు

జడ్పీటీసీ, ఎంపీటీసీ మూడో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మూడో విడతలో రాష్ట్రంలోని 27 జిల్లాలో 161 జడ్పీటీసీ, 1738 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. కాగా వీటిలో ఇప్పటికే 30 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమవడంతో మూడో విడతలో 160 జడ్పీటీసీ, 1710 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. 160 జడ్పీటీసీ స్థానాలకు బరిలో 741 మంది అభ్యర్థులు.. 1708 ఎంపీటీసీ స్థానాలకు పోటీలో 5,726 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించారు. తొలివిడతలో వాయిదాపడిన సిద్దిపేట జిల్లాలోని అల్వాల్, రంగారెడ్డి జిల్లాలోని అజీజ్‌నగర్ ఎంపీటీసీ స్థానాలకు కూడా అధికారులు నేడు పోలింగ్ చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా ఉన్నతాధికారులు పోలింగ్‌ను పర్యవేక్షించారు.