రజనీకాంత్‌కు ధైర్యం లేదు..! రాజకీయాల్లోకి రారు..!

రజనీకాంత్‌కు ధైర్యం లేదు..! రాజకీయాల్లోకి రారు..!

తమిళ సూపర్ స్టార్ రాజకీయ ప్రవేశంపై ఎప్పటి నుంచే చర్చ సాగుతూనే ఉంది.. త్వరలోనే ఆయన పార్టీ పెడతారనే ప్రచారం సాగుతూనే ఉంది. అయితే.. రజనీ రాజకీయ ప్రవేశంపై ఎవరి అభిప్రాయాలు వారికున్నాయి.. అసలు రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రారని, వచ్చే ధైర్యం ఆయనకు లేదన్నారు తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు తిరునావుక్కరస్‌. రజనీకాంత్‌ ఖచ్ఛితంగా రాజకీయాల్లోకి రారని, ఆయన నటించిన ఒక్కో చిత్రం విడుదల కోసమే రాజకీయ వ్యాఖ్యలు చేశారని, రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆయనకు ధైర్యం లేదన్నారు. ఇక, కమల్‌హాసన్‌ అందంగా, ఎవరికీ అర్థంకాని భాషలో మాట్లాడు తున్నారని, భవిష్యత్తులో ఆయన ఏమి చేయనున్నారో ప్రజలకు నిదానంగా అర్థమయ్యే అవకాశముందని అభిప్రాయపడ్డారు తిరునావుక్కరసర్‌.