సైరాలో హైలైట్ కాబోయో పాత్ర ఇదే...

సైరాలో హైలైట్ కాబోయో పాత్ర ఇదే...

మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న చారిత్రాత్మక సినిమా సైరా.  ఈ మూవీ గాంధీ జయంతి రోజున రిలీజ్ కాబోతున్నది.  ఇందులోని అన్ని పాత్రలు హైలైట్ గా నిలిచినా... కొన్ని మాత్రం ప్రేక్షకులపై చెరగని ముద్రను వేయబోతున్నాయని వినికిడి.  అలాంటి పాత్రల్లో ఒకటి విజయ్ సేతుపతి చేస్తున్న పాత్ర.  కాస్త నెగెటివ్ టచ్ ఉండే ఈ పాత్రలో విజయ్ సేతుపతి అద్భుతంగా నటించారని తెలుస్తోంది.  

విజయ్ సేతుపతి గూఢచారి పాత్రలో కనిపించబోతున్నారు.  ఈ పాత్ర సినిమాకు హైలైట్ గా ఉంటుందని అంటున్నారు.  మెగాస్టార్ తో పాటు కన్నడ స్టార్ హీరో సుదీప్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్, లేడీ సూపర్ స్టార్ నయనతార తదితరులు నటిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.  సురేందర్ రెడ్డి దర్శకుడు.