మహర్షిలో హైలైట్ సీన్ ఇదేనా..?

మహర్షిలో హైలైట్ సీన్ ఇదేనా..?

మహేష్ బాబు మహర్షి సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ ఏప్రిల్ 5 నుంచి పోస్ట్ ఫోన్ అయింది.  ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం తెలియాల్సి ఉంది.  మహేష్ స్టూడెంట్ గా, వ్యాపారవేత్తగా, రైతుగా కనిపిస్తున్నారు.  వ్యాపారవేత్తగా అమెరికాలో ఉండగా.. తన స్నేహితుడు అల్లరి నరేష్ సమస్య రావడంతో.. మహేష్ ఇండియా వస్తాడు. ఇండియాలో రైతుగా మారి.. వ్యవసాయంలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాడు. 

ఈ సమయంలో మహేష్ పై కొంతమంది ఎటాక్ చేయడం వారిని మహేష్ ఎదుర్కొనడం జరుగుతుందట.  మహేష్ రైతుగా మారి ట్రాక్టర్ తో పొలంలో ఉన్నప్పుడు మహేష్ పై ఎటాక్ జరుగుతుంది.  ఈ సందర్భంలో వచ్చే ఫైట్ ను భారీ ఎత్తున చిత్రీకరించేందుకు వంశి ప్లాన్ చేస్తున్నాడట.  60 ట్రాక్టర్లును ఇందుకోసం ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది.  ఈ ఫైట్ సినిమాకు హైలైట్ గా ఉంటుందట.