మన్మథుడు 2 సినిమాకు ఇన్స్పిరేషన్ ఇదే..!!

మన్మథుడు 2 సినిమాకు ఇన్స్పిరేషన్ ఇదే..!!

నాగ్ మన్మథుడు 2 ఆగష్టు 9 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది.  ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు ఇటీవలే బయటకు వచ్చాయి.  ఫస్ట్ నుంచి మన్మథుడు 2 మూవీ ఒరిజినల్ మన్మథుడు సినిమాకు సీక్వెల్ అని ప్రచారం జరిగింది.  మరోవైపు హాలీవుడ్ సినిమా వాట్ విమెన్ వాంట్ అనే సినిమాకు రీమేక్ అని కూడా ప్రచారం జరిగింది.  

అయితే, ఈ మూవీ ఒరిజినల్ మన్మథుడు సినిమాకు సీక్వెల్ కాదని, ఫ్రెంచ్ సినిమాకు రీమేక్ అని ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో చెప్పాడు నాగ్.  ఫ్రెంచ్ సినిమా రీమేక్ అని చెప్పినా ఆ సినిమా ఏంటి అన్నది చెప్పకపోవడం విశేషం.  తాజా సమాచారం ప్రకారం మన్మథుడు 2,  2006 లో వచ్చిన ఫ్రెంచ్ సినిమా ఫ్రీట్ మొయి ట మెయిన్ అనే సినిమాకు రీమేక్ అని నాగ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఇంస్టాగ్రామ్ చిట్ చాట్ లో పేర్కొన్నారు.  రెండేళ్ల క్రిత్రం సినిమా చూసినట్టు చెప్పిన నాగ్, ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం చాలా ఖర్చు చేసినట్టు పేర్కొన్నాడు.  రకుల్ ప్రీత్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.