మహర్షి తొలిరోజు టార్గెట్ ఇదే..

మహర్షి తొలిరోజు టార్గెట్ ఇదే..

మహేష్ బాబు మహర్షి సినిమా థియేటర్లోకి వచ్చింది.  యూఎస్ లో పాజిటివ్ టాక్ రావడంతో మహేష్ అభిమానుల్లో జోష్ పెరిగింది.  తెలంగాణ రాష్ట్రంలో చాలా కాలం తరువాత ఐదు షోలకు అనుమతి ఇవ్వడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం లేకపోలేదు.  మహేష్ 25 వ సినిమా కావడంతో పాటు సున్నితమైన రైతు సమస్యల చుట్టూ కథ ఉండటంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.  

భరత్ అనే నేను మంచి హిట్ కొట్టి వంద కోట్లకు పైగా వసూలు చేసినా.. మొదటి రోజు అనుకున్న రికార్డును అందుకోలేకపోయింది.  ఇప్పుడు పోటీ లేకపోవడంతో పాటు దిల్ రాజు నిర్మాత కావడంతో ఫస్ట్ డే కలెక్షన్లపైనే అందరి చూపులు ఉన్నాయి.  మొదటిరోజు రూ.30 కోట్ల రూపాయల వసూళ్లను టార్గెట్ గా పెట్టుకున్నారు.  మరి ఈ టార్గెట్ ను మహర్షి రీచ్ అవుతుందా చూద్దాం.