ఆర్ఆర్ఆర్ లో నిత్యా పాత్ర ఇదే

ఆర్ఆర్ఆర్ లో నిత్యా పాత్ర ఇదే

ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  రామ్ చరణ్ గాయం కారణంగా షూటింగ్ వాయిదా పడింది.  త్వరలోనే తిరిగి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది.  కథ ప్రకారం అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్న రామ్ చరణ్ కు జోడిగా అలియా భట్ నటిస్తుంటే... కొమరం భీం పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ కు జోడిగా మొదట విదేశీ భామ డైసీ ని ఎంపిక చేశారు.  

కొన్ని కారణాల వలన డైసీ ఈ సినిమా నుంచి తప్పుకుంది.  డైసీ తరువాత ఆ పాత్ర కోసం రాజమౌళి అనేకమంది పేర్లను పరిశీలించారు.  నిత్యా మీనన్ ను కూడా స్క్రీన్ టెస్ట్ చేసి ఆమెను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.  ఇందులో నిత్యా మీనన్ చేస్తున్న పాత్ర ఏంటి అనే విషయంపై క్లారిటీ వచ్చింది.  కొమరం భీం ను ఆరాధించే గిరిజన యువతి పాత్రలో నిత్యా నటిస్తోందట. కథ ప్రకారం కొమరం భీం కు ముగ్గురు భార్యలు ఉండగా అందులో ఒకరిగా నిత్యా మీనన్ కనిపిస్తోందని సమాచారం.  విదేశీ యువతి పాత్రలో ఎవరు నటిస్తున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.