రెహ్మాన్ రిటర్న్ గిఫ్ట్ ఇదేనా..?

రెహ్మాన్ రిటర్న్ గిఫ్ట్ ఇదేనా..?

ఏఆర్ రెహ్మాన్ ... ఈ పేరు తెలియని వ్యక్తులు బహుశా ఉండకపోవచ్చు.  రెహ్మాన్ సంగీతం అందించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్టయ్యాయి.  ముఖ్యంగా రెహ్మాన్.. మణిరత్నం, రెహ్మాన్..శంకర్ కాంబినేషన్లో వచ్చిన సినిమా సూపర్ హిట్టయ్యాయి.  రెహ్మాన్ తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేశాడు. గ్యాంగ్ మాస్టర్, సూపర్ పోలీస్, నాని, పులి, ఏం మాయ చేశావే, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలు చేశారు.  ఇందులో ఏం మాయ చేశావే మినహా మిగతా అన్ని మ్యూజికల్ గా హిట్ కొట్టలేకపోయాయి.  ఏం మాయ చేశావే తమిళ్ సినిమా రీమేక్ కావడంతో స్ట్రెయిట్ మూవీ అని చెప్పలేము.  

తెలుగులో ఒక్క హిట్ కూడా కొట్టలేకపోవడానికి కారణం ఏంటి.. ఎప్పుడు తెలుగులో హిట్ కొడతారు అనే దానిగురించి రెహ్మాన్ వెరైటీ సమాధానం చెప్పాడు.  తెలుగులో స్ట్రెయిట్ మూవీ హిట్ కొట్టడం తన చేతుల్లో లేదని అంతా దేవుడి దయ అని చెప్పాడు. ఇదిలా ఉంటె, రెహ్మాన్ ప్రస్తుతం 99 సాంగ్స్ అనే త్రిభాషా చిత్రం చేస్తున్నాడు.  మ్యూజిక్ తో పాటు కథ, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.  కొత్తవాళ్లతో చేస్తున్న ఈ సినిమా దాదాపు పూర్తికావచ్చింది.  జూన్ 21 వ తేదీన రిలీజ్ చేయబోతున్న ఈ సినిమా తెలుగులో హిట్ కొడితే స్ట్రెయిట్ హిట్ కూడినట్టే అవుతుంది కదా.  హిట్ కొట్టాడు అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టే అవుతుంది.