ఈ డ్రస్‌తో ఎగరనూవచ్చు

ఈ డ్రస్‌తో ఎగరనూవచ్చు

ఇక మీరు ట్రాఫిక్‌ సమస్యలతో బాధపడాల్సిన పనిలేదు. ఏకంగా గాల్లో ఎగురుతూ గమ్యానికి చేరుకోవచ్చు. టెక్నాలజీ అంతగా పెరిగిపోయింది మరి.  ఇపుడు మార్కెట్‌లో ఏకంగా జెట్ సూట్‌లు   వచ్చేశాయి. ఇవి ధరిస్తే చాలు... గాల్లో ప్రయాణంచేయొచ్చు.  అయితే...ప్రస్తుతానికి వీటితో ఎక్కువ దూరం ప్రయాణించలేం.  ఇపుడు లండన్ స్ట్రీట్‌లో అమ్ముతున్న జెట్‌ సూట్‌ ధరించి నాలుగు నిమిషాలు ప్రయాణం చేయొచ్చు.  గతంలో కమాడీటీ ఎక్స్ఛేంజీలో ట్రేడింగ్‌ చేసే ఓ వ్యాపారి వీటిని తయారు చేయించాడు.  ఈ జెట్ సూట్ లండన్ డిపార్ట్ మెంట్‌ స్టోర్ లో లభ్యమవుతోంది. ఇది  మైక్రో చిప్స్ తో పనిచేస్తుంది. ఈ సూట్‌కు అయిదు ఇంజిన్లు ఉంటాయి.  వీటిని సూట్ చేతులు, వీపుపై అమర్చుతారు.  బ్యాటరీలతో పనిచేసే ఈ జెట్ సూట్ ధరించి ప్రస్తుతానికి 3 లేదా 4 నిమిషాలు ప్రయాణం చేయొచ్చు. భవిష్యత్ లో మరింత ఎక్కువ సమయంలో ప్రయాణించే అవకాశముంది.