ఇది ట్రైలరే...అసలు సినిమా ముందుందన్న మోడీ

ఇది ట్రైలరే...అసలు సినిమా ముందుందన్న మోడీ

జార్ఖండ్ వేదికగా 'ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధర్ యోజన', 'లఘు వ్యాపారి మాన్ ధన్' పథకాలను ప్రారంభించిన మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఎన్నికల సమయంలో పని చేసే సత్తా ఉన్న, దమ్మున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తాను ప్రజలకు మాటిచ్చానని, ఈ వంద రోజుల పాలన కేవలం ట్రైలర్ లాంటిదే అని, అసలు సినిమా ముందుందని అన్నారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తాము సంకల్పించుకున్నామని, అందులో భాగంగా తీవ్రవాద నిరోధక చట్టాన్ని బలోపేతం చేశామని అన్నారు. జమ్మూకశ్మీర్, లడక్ లో అభివృద్ధిని నూతన శిఖరాలకు తీసుకెళ్లాలని సంకల్పించుకున్నామని, ఈ వంద రోజుల్లో ఆ దిశగా చర్యలు చేపట్టామని అన్నారు. ప్రజలను దోచుకున్న వారిని సరైన స్థానాలకు పంపిస్తామని, ఆ ప్రకియ కూడా మొదలైందని, ఇప్పటికే కొందరు జైలుకి కూడా వెళ్లారని పేర్కొన్నారు.